10వ రోజు పెరిగిన బంగారం ధరలు…

106
gold rate

వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. పదో రోజు కూడా పెరిగిన పసిడి ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. బంగారం దారిలోనే వెండికూడా పెరిగింది.

హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి రూ.55,820కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరుగుదలతో రూ.51,250కు చేరింది.

ఇక పసిడి బాటలోనే కేజీ వెండి ధర రూ.2000 పెరిగి రూ.65,000కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 1.49 శాతం పైకి పెరిగింది. కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు సహా గ్లోబల్ మార్కెట్‌లో బంగారం పరుగులు పెట్టడంతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కారణమయ్యాయి.