ఎస్సి ఎస్టిల ఉద్యోగ కల్పనకు సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారు- సీఎస్

47
cs

రాష్ట్రంలో ఎస్సి, ఎస్టి యువతలో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (Entrepreneurship) పెంపొందించటానికి అవసరమైన సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కట్టుబడి ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. సోమవారం బిఆర్ కెఆర్ భవన్ లో డిక్కి బృందం (Dalit Indian Chamber of Commerce & Industry) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.

ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ.. ఎస్సి,ఎస్టి వీకర్ సెక్షన్ కు సంబంధించిన వారు పారిశ్రామికవేత్తలుగా విజయం సాధించటానికి వారు వివిధ రంగాలలో రానించటానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. డిక్కీ ద్వారా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పెంపొందించటం కోసం చేపట్టే కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు. వివిధ పరిశ్రమలలో డిక్కి ఇన్నోవేటివ్ ఐడియాలు అమలు చేస్తున్నందుకు సి.ఎస్ అభినందిస్తూ జాతీయ స్ధాయిలో ఎస్సి,ఎస్టి ఎంటర్ ప్రెన్యూర్ లు రోల్ మోడల్ గా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేసారు.

ప్రభుత్వం సీఎంస్‌ ఎస్‌టీ ఎంటర్ ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ద్వారా విజయవంతంగా శిక్షణను అందిస్తుందన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.టి రామారావు పరిశ్రమల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఎంటర్ ప్రెన్యూర్ షిప్ రంగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు కృషి చేయాలని సి.ఎస్ వారిని కోరారు.

ఈ సమావేశంలో Dalit Indian Chamber of Commerce & Industry ప్రతినిధులు Ms.అరుణ దాసరి, పద్మశ్రీ రవి కుమార్ నర్రా, రాహుల్ కిరణ్, సురేష్ నాయక్, మున్నయ్య తమనం, మునీంధర్, రమేశ్ నాయక్, వెంకటేశ్వర్ రావు, పరమేశ్‌లు పాల్గొన్నారు.