సింగరేణి కార్మికుల సంక్షేమమే ధ్యేయం: ఎమ్మెల్సీ కవిత

41
mlc kavitha

సింగరేణి కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు, సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు పలు వినతులను ప్రస్తావించగా, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ అధ్యక్షులు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి,ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు ఆరెపల్లి రాజేందర్, రాజేశ్వర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.