ఢిల్లీ కాంగ్రెస్‌లో సంక్షోభం..

14
- Advertisement -

ఢిల్లీ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. నేతల వరుస రాజీనామాలు ఆ పార్టీకి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని రెండు లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్‌ బసోయా, నసీబ్‌ సింగ్‌ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

వేర్వేరుగా రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా ఉన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని.. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు నీరజ్.

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవిందర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టు వాయువ్య ఢిల్లీ పార్టీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే నసీబ్ సింగ్ ప్రకటించారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేసిన నాలుగు రోజులకే వీరిద్దరూ కాంగ్రెస్‌ను వీడటం చర్చనీయాంశంగా మారింది.

Also Read:చికెన్‌ తింటున్నారా.. జాగ్రత్త !

- Advertisement -