దర్శకుల సంఘానికి రూ.5 లక్షల విరాళం

3
- Advertisement -

సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకులు బి.సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం సభ్యులకు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు 5 లక్షల రూపాయలు విరాళంగా అందించారని ఆ సంఘ అధ్యక్షులు బి.వీర శంకర్, కార్యదర్శి సి.హెచ్.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.

తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఎప్పుడు అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని ఈ ఏడాది గ్రూప్ ఇన్సూరెన్స్ పథకానికి తానిప్పుడు ఐదు లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నానని ఆయన చెప్పడం తమకెంతో ఆనందాన్ని కలిగించింది అని ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Also Read:KTR:కంపు కొడుతున్న పల్లెలు, ఇదేనా ప్రజాపాలన?

- Advertisement -