టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ముఖ్యమా,బీజేపీ ముఖ్యమా తేల్చుకోవాలన్నారు సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్. భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన బృందా కారత్…పోడు భూముల విషయంలో ముఖ్యమంత్రికి నిజాయితీ ఉంటే విడుదల చేసినటువంటి జీవోలో తక్షణమే మార్పులు చేయాలి ఇది రైతులకు నష్టదాయకమైన జీవో అన్నారు.
ఏజెన్సీ చట్టాలకు చట్టబద్ధమైన హక్కును నిరాకరించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. సర్క్యులర్ పేరుతో రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా టిఆర్ఎస్ వ్యవహరిస్తోంది ప్రస్తుతం దాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి లక్ష కోట్లు పెట్టి కాలేశ్వరం ప్రాజెక్టు కట్టాక రైతులను వరి పంట వేయవద్దని ఎలా చెబుతారన్నారు. ప్రాజెక్టులు వచ్చిన తర్వాత రైతులు ప్రధానంగా వరి పంటను సాగు చేస్తారని…ప్రాజెక్టుల కోసం ఈ లక్షల కోట్లు ఖర్చు చేసింది రైతుల భవిష్యత్తు కోసమా కాంట్రాక్టర్ల లాభాల కోసమా అని ప్రశ్నించారు.
బిజెపి విధానాలను వ్యతిరేకించాల్సినది పోయి బీజేపీ విధానాలకు తెలంగాణ రైతులను బలి ఇవ్వడాని మీరు సిద్ధంగా ఉన్నారు…మీకు బిజెపి ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అన్నారు. బీజేపీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం నిలకడగా నిబద్ధతగా ప్రత్యామ్నాయ విధానాలతో పోరాటం చేస్తే మేము తప్పకుండా సహకరిస్తాం అన్నారు.