ఏపీ ప్రభుత్వంపై సిపిఐ నారాయణ ధ్వజం..

68
- Advertisement -

గత 50 ఏళ్ల ఉద్యమ చరిత్రలో ‘మాకు పెరిగిన జీతాలు వద్దు. పాత జీతాలే కావాలి” అని ఉద్యోగులు కోరిన ఘటన మొట్టమొదటిసారి ఏపీలోనే చూస్తున్నాను అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి.కె. నారాయణ. దీనిని ప్రభుత్వం అంత తేలికగా తీసుకోకూడదు. నిజంగా జీతాలు పెరిగితే పెరిగిన జీతాలు తీసుకోకుండా ఉద్యోగులు ఉండే ప్రసక్తి లేదు. వారికొచ్చే ఎయిడ్ ఎందుకు పోగొట్టుకుంటారు? ‘మాకు రావాల్సిన బాకీ కలిపితే జీతాలు ఎక్కువగా ఇస్తున్నామని’ ప్రభుత్వం చెప్పడం మోసపూరిత వైఖరి అని ఏపీ సర్కారుపై నారాయణ ద్వజమెత్తారు. ఇది 420 యాక్ట్ క్రిందకు వస్తుంది. అలాంటి మోసపూరిత వైఖరికి తిరస్కరణగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ‘మాకు పాత జీతాలే కావాలి. పెరిగిన జీతాలు వద్దని చెప్పడం చారిత్రాత్మకం అన్నారు.

ఇదంతా సజ్జల రామకృష్ణారెడ్డి నడిపిస్తున్నది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నడిపిస్తున్నారు. మంత్రులు, సలహాదార్లంతా జగన్మోహనరెడ్డి ఎట్లా అడమంటే అట్లా ఆడేవాళ్లే తప్ప వేరేకాదు. జగన్మోహనరెడ్డి ప్రధమ ముద్దాయి తప్ప ఇంకొకరు కాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వీరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎన్ని నిర్భంధాలు, అడ్డంకులు చేసినా వేలాది మంది ఉద్యోగులు మారు వేషాల్లో సైతం చలో విజయవాడకు వచ్చారు. చివరికి రాష్ట్ర యుటిఎఫ్ నాయకురాలు నిర్మల బురఖా వేషంలో వచ్చి ఉద్యమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినిబట్టి అర్ధం చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్దేయంగా, నిర్ధాక్షిణ్యంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అంత నిర్భంధకాండను కొనసాగించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికేం వచ్చింది? అని నారాయణ ప్రశ్నించారు.

- Advertisement -