సైబరాబాద్‌లో పెరిగిన క్రైం రేటు:స్టీఫెన్ రవీంద్ర

245
cp
- Advertisement -

సైబరాబాద్‌లో ఈ ఏడాది క్రైం రేటు పెరిగిందన్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. 2020 – 2021 సంవత్సర యాన్యువల్ ప్రెస్ మీట్ బుక్ రిలీజ్ చేశారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ కార్యక్రమంలో డీసీపీ లు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్టీఫెన్ రవీంద్ర…సైబరాబాద్ లో మొత్తం 42 వేల 483 కేసులు నమోదు అయితే, 30 వేల 954 కేసులు డిస్పోజ్ చేశాం అన్నారు. ప్రాపర్టీ రికవరీ 53 % గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రికవరీ రేటు పెరిగిందన్నారు.194 డ్రగ్స్, గంజా కేసులు నమోదు… 410 మంది అరెస్ట్, 23 మంది పై పీడీ యాక్ట్ లు నమోదు చేశామన్నారు. మొత్తం 200 మంది క్రిమినల్స్ పై పీడీ యాక్ట్ లు నమోదు చేసినట్లు వెల్లడించారు.

నార్సింగ్ పీఎస్ పరిధిలో బాలిక పై జరిగిన రేపు అండ్ మర్డర్ కేసులో నిందితునికి ఉరిశిక్ష అమలు అయిందన్నారు.14 మందికి జీవిత ఖైదీ….క్రైం రేటు, సైబర్ క్రైం పెరిగిందన్నారు. వీకర్ సెక్షన్స్ లలో క్రైం రేటు తగ్గింది…3854 సైబర్ క్రైం లు రిజిస్టర్ అయినట్లు తెలిపారు. 36512 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని…ఆపరేషన్ స్మైల్ అండ్ ముస్కాన్ ద్వారా 310 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించాం అన్నారు.

22 బాల్య వివాహాలు అడ్డుకున్నాం…ఈ సంవత్సరం 38 వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం అన్నారు. 75 మంది పై రౌడీ షీట్స్ పెట్టాం..78 స్నాచింగ్ కేసులు పెట్టామన్నారు. 721 రోడ్డు ప్రమాదాలు జ‌రుగగా, 759 మంది చనిపోయారని…82% టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ వాడకపోవడం వలనే చనిపోయినట్లు వెల్లడించారు.

- Advertisement -