టీటీడీకి 10 వేల మంది పాదయాత్ర…

27
padayathra

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలకు చేరుకున్న ప్రాంతంలో ఇప్పుడు సందడి వాతావరణం నెలకుంటోంది. భారీ ఎత్తున్న భక్తులు కడప నుంచి తిరుమలకు వచ్చే అన్నమయ్యా మార్గం ద్వారా తిరుమలకి చేరుకుంటున్నారు. మొన్న కడప జెట్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భక్తులు తిరుమలకు చేరుకోగా…. ఇవాళ 10 వేల మంది భక్తులు అన్నమయ్య మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు.

స్థానిక నేతల సహకారంతో కడప నుంచి పాదయాత్రగా తిరుమలకు చేరుకున్న భక్తులకు వసతి., శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించింది టీటీడీ. ఒక్కసారిగా తిరుమల రోడ్డుపైకి వచ్చిన భక్తుల సందోహాన్నీ చూసిన స్థానికులు ఒకింత ఆశ్చర్యనికి గురైయ్యారు. కరోనా నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తిరుమలకు అనుమతిస్తుంది టీటీడీ. ఈ నేపథ్యంలో 10 వేల మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పించారని టిక్కెట్లు పొందలేని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ అవలంబిస్తున్న వైఖరి మంచిది కాదని భక్తులు వాపోతున్నారు. అయితే గత పాలకమండలిలో మూడవ ఘాట్ రోడ్డు పై తీవ్ర చర్చ సాగింది.

రెండవ ఘాట్ రోడ్డులో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడవ మార్గంపై చర్చ సాగుతున్న నేపథ్యంలోఅన్నమయ్య మార్గాన్ని మూడవ మార్గంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. దింతో కడప ప్రజలు పూర్తి స్థాయిలో అన్నమయ్య మార్గానికి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నమయ్య మార్గాన్ని త్వరిత గతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.