సాయిధరమ్‌పై ఛార్జ్ షీట్!

31
saidharam

హీరో సాయిధరమ్ తేజ్‌పై త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయని తెలిపారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ప్రమాదం జరిగినప్పుడే కేసు నమోదు చేశామని, అందువల్ల లైసెన్స్, బైక్ ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేశామని తెలిపారు. కానీ, తేజు ఆ నోటీసులకు స్పందించలేదని, అందుకే అతనిపై త్వరలోనే ఛార్జ్ షీట్ ని దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

ఇటీవల సాయిధర్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలతో బయటపడిన తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అయితే ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నోటీసులు పంపగా తేజు స్పందించలేదు. దీంతో త్వరలో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు సీపీ.