ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో లైవ్ కవరేజ్..

241
- Advertisement -

యాదాద్రిభువనగిరి జిల్లాచౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సిపి మహేష్ భగవత్ పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…ఈ ఉప ఎన్నికల్లో చాలా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశాం అన్నారు. మొదటిసారిగా ఈ ఉప ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు.

పంతంగి టోల్ ప్లాజా, తూప్రాన్ పేట, దామెర దగ్గర ప్రధాన చెక్ పోస్ట్ లో సిఆర్పిఎస్సి బలగాలతో తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్నారు. రౌడీషీటర్స్ గత ఎన్నికల్లో నేరస్తులని బైండోవర్ చేయడం జరిగిందన్నారు. నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది.. 1000లీటర్ల లిక్కర్, ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నాం అన్నారు.

చెక్ పోస్ట్ల దగ్గర పొద్దున రాత్రి చెకప్ చేయడం జరుగుతుందన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు మీద ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో లైవ్ కవరేజ్ ఉంటుందని… ప్రతి పోలింగ్ బూత్ కి ఒక సబ్ ఇన్స్పెక్టర్ అధికారిని నియమించాం అన్నారు. రెండువేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 గాని, 9490617117సమాచారం ఇవ్వాలన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో కౌంటింగ్ డే వరకు బందోబస్తు ఉంటుందన్నారు. నాన్ లోకల్ వాళ్ళు నిన్న సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోవాలి,,, ఒకవేళ అలా వెళ్ళిపోని వాళ్ళు ఉంటే తక్షణమే వెళ్ళిపోవాలన్నారు. లేకపోతే కేసులు నమోదు చేసి, వాళ్ళ వెహికల్స్ సిజ్ చేస్తామని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

జోడో జోష్..రాహుల్‌తో బాలీవుడ్ నటి

ఓటీటీలోకి గాడ్‌ ఫాదర్.

- Advertisement -