- Advertisement -
దేశంలో ఇప్పటి వరకు 1.23 మందికిపైగా ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా టీకా ఇచ్చినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ. టీకా డ్రైవ్ 40వ రోజుకు చేరగా.. దేశవ్యాప్తంగా బుధవారం ఒకే రోజు మొత్తం 2,01,035 వ్యాక్సిన్ మోతాదాలు ఇచ్చినట్లు మంత్రిత్వశాఖ వివరించింది.
బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 1,23,66,633 వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించింది. ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోస్ 65,24,726 మంది, రెండో మోతాదును 14,81,754 మంది తీసుకున్నారని వెల్లడించింది కేంద్రం.
వ్యాక్సిన్ డ్రైవ్‌లో అత్యధికంగా మహారాష్ట్రలో 10,58,136 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్ వేయగా ఉత్తరప్రదేశ్‌లో 12,26,775 మందికి, గుజరాత్‌లో 9,10,064, పశ్చిమ బెంగాల్‌లో 8,35,026, కర్ణాటకలో 7,55,159, మధ్యప్రదేశ్‌లో 6,90,740లో వ్యాక్సిన్ వేసినట్లు తెలిపింది కేంద్రం.
- Advertisement -