కరోనాను ఎదుర్కొనేందుకు సక్సెస్ ఫార్ములా…వ్యాక్సిన్లే. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి కరోనాను కంట్రోల్ చేయడంలో విజయవంతం అయ్యారు. తాజాగా కొత్త పరిశోధనలో ఇదే వెల్లడైంది.
వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని ….ఒకవేళ కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని వెల్లడైంది. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ వేసుకున్న సిబ్బందిపై సెయింట్ జ్యూడ్ చిల్డ్రన్ రీసెర్చ్ ఆస్పత్రి సైంటిస్టులు ఇటీవల అధ్యయనం చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్ సోకినప్పటికీ లక్షణాలు కనిపించినా లేదా కనిపించకపోయినా ఇన్‌ఫెక్షన్ల తీవ్రత సగటున 79శాతం తక్కువగా ఉంటున్నాయని తేలింది. రెండో డోసు తీసుకున్న తర్వాత కనీసం వారం రోజులకు కొవిడ్ నుంచి 96శాతం రక్షణ అందుతోంది. దీంతో ఇప్పుడు భారత్‌లో కూడా వ్యాక్సినేషన్ కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.