అలర్ట్…ఆగస్టు నాటికి 10 లక్షల మంది మృతి..!

126
covid 19
- Advertisement -

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజుకు రికార్డు స్ధాయిలో 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా పరిస్థితులపై అంతర్జాతీయ జర్నల్ ద లాన్‌సెట్ సంచలన విషయాలు వెల్లడించింది.

ఆగస్టు 1 నాటికి దేశంలో 10 లక్షల మంది మృత్యువాతపడతారని వెల్లడించింది. ఒకవేళ ఇదే జరిగితే..ఈ జాతీయ విపత్తులో కేంద్రంలోని మోదీ సర్కారే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపింది.

ఇప్పటికైనా కరోనా కట్టడిలో జాగ్రత్తలు తీసుకోవాలని…ఓవైపు బాధితులతో ఆసుపత్రులన్నీ నిండిపోతుండగా మరోపక్క మందులు, బెడ్స్, ఆక్సిజన్ అందకరోగులు అష్టకష్టాలు పడుతున్నారని వెల్లడించింది. ఇప్పటికైనా మేల్కోని బాధ్యతాయుతమైన నాయకత్వం, పారదర్శకతతో కూడిన పాలన అందించాలని సూచించింది.

- Advertisement -