హాకీ దిగ్గజం రవీందర్‌ పాల్ కన్నుమూత

97
ravinder

భారత హాకీ దిగ్గజం, మాస్కో ఒలింపిక్స్ 1980 బంగారు పతక విజేత రవీందర్ పాల్ సింగ్ ఇకలేరు. కరోనా నుండి కోలుకున్న తర్వాత అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

సింగ్‌కు ఇంకా పెళ్లికాలేదు. ఆయన మేనకోడలు ప్రగ్యా యాదవ్ రవీందర్ సింగ్ బాగోగులు చూసుకున్నారు.సీతాపూర్‌లో జన్మించిన రవీందర్ పాల్ సింగ్ 1979 నుండి 1984 వరకు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. రెండు ఒలింపిక్స్‌తో పాటు, అతను

1980 మరియు 1983 లో ఛాంపియన్స్ ట్రోఫీ, 1982 ప్రపంచ కప్ మరియు 1982 ఆసియా కప్‌లను కూడా ఆడాడు. ఆయన మరణం పట్ల హాకీ ఇండియా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సంతాపం ప్రకటించారు.