అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్..

196
third wave
- Advertisement -

అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రస్ధాయికి చేరుతుందని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ. కరోనా థర్డ్ వేవ్‌పై హెచ్చరికలు జారీ చేసిన కమిటీ…ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న స‌దుపాయాలు అవ‌స‌రానికి ద‌రిదాపుల్లో కూడా లేవ‌ని ఈ క‌మిటీ చెప్పింది. ఈ రిపోర్ట్‌ను ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యా(పీఎంవో)నికి స‌మ‌ర్పించింది.

పెద్ద‌ల‌తో పాటు పిల్ల‌ల‌పైనా థర్డ్ వేవ్ ప్ర‌భావం చూప‌నుంద‌ని…. దేశంలో పీడియాట్రిక్ (చిన్న పిల్ల‌ల వైద్యం) వ‌స‌తుల‌ను భారీగా పెంచాల్సిన అవ‌స‌రం ఉన్న‌ద‌ని త‌న రిపోర్ట్‌లో తెలిపింది. డాక్ట‌ర్లు, సిబ్బంది, వెంటిలేట‌ర్లు, అంబులెన్స్‌ల వంటి వాటిని మెరుగుప‌ర‌చాల‌ని తేల్చి చెప్పింది.

వైర‌స్ వ‌ల్ల పిల్ల‌ల‌పై మ‌రీ ఎక్కువ ప్ర‌భావం ప‌డ‌క‌పోయినా.. వాళ్లు ఇత‌రుల‌కు వ్యాపింప‌జేసే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంద‌ని కమిటీ తెలిపింది. ఇక దేశ‌వ్యాప్తంగా పీడియాట్రిక్ స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డంతోపాటు పిల్ల‌ల వెంట హాస్పిట‌ల్స్‌లో ఉండే గార్డియన్స్ సుర‌క్షితంగా ఉండేలా ప్ర‌త్యేక కొవిడ్ వార్డుల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని క‌మిటీ సూచించింది.

- Advertisement -