సలార్ అప్‌డేట్…రాజమన్నార్ లుక్ రివీల్

178
salaar
- Advertisement -

రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగా సినిమా నుండి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా జగపతిబాబు లుక్‌ని రివీల్ చేసింది చిత్రయూనిట్.

జగపతి బాబును రాజమన్నార్ గా చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగ్గూ భాయ్ రస్టిక్ లుక్ లో ఉన్న బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. సినిమా షూటింగ్ లో మేజర్ పార్ట్ పూర్తయింది. దీంతో సినిమా ప్రమోషన్‌లను స్టార్ట్ చేశారు మేకర్స్.

హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగండూర్ నిర్మించగా కన్నడ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు. 14 ఏప్రిల్ 2022 న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -