ఇక‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే శిక్ష ఎంటో తెలుసా?

374
drunk and drive
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌డ్డుబ‌డ్డ వ్య‌క్తులకు కోర్టు వింత శిక్ష‌ను విధించింది. ఇన్ని రోజులు తాగి వాహ‌నాలు న‌డిపితే జ‌రిమానా విధించ‌డం లేదా శిక్ష‌విధించ‌డం చేసేవాళ్లు. లేదంటే వాహ‌నాన్ని సీజ్ చేసేవారు. ఇప్పుడు తాజ‌గా కోర్టు తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల ట్రాఫిక్ పోలీసుల‌కు కొంచెం ప‌ని త‌గ్గించిన‌ట్ట‌యింది. మ‌ద్యం తాగి వాహ‌నాలు నడిపిన వారికి కోర్టు విధించిన శిక్ష మేర‌కు రాచ‌కొండ పోలీసులు నేడు ఆ శిక్ష‌ను అమ‌లు చేశారు.

Traffic Police

హైద‌రాబాద్ ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబడ్డ వారికి ఈరోజు ఇ శిక్ష‌ను విధించారు పోలీసులు. ఇంత‌కి ఆ శిక్ష ఎంటో తెలుసా? ఒక రోజు మొత్తం వారు ట్రాఫిక్ విధులు నిర్వ‌ర్తించాలి. సుర‌క్షితంగా గ‌మ్య‌స్దానానికి చేరేందుకు ట్రాఫిక్ నియ‌మాలు పాటించాల‌ని ఆ ప్ల‌కార్డుల మీద రాసి ఉంది. మ‌ద్యం తాగి వాహ‌నం న‌డ‌ప‌రాదు అంటూ ప్ల‌కార్డులు ప‌ట్టుకుని వారంద‌రూ ఇలా రోడ్డుపై నిల‌బ‌డి ప్ర‌చారం చేశారు. ఇప్పుడు ఈఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కోర్టు తీసుకున్న ఈనిర్ణ‌యం చాలా బాగుందంటున్నారు ప్ర‌జ‌లు.

ఇది చూసి అయినా కొంత మంది సిగ్గుప‌డి తాగి వాహ‌నాలు న‌డ‌ప‌డం మానుకుంటార‌న్నారు రాచ‌కొండ ట్రాఫిక్ పోలీసులు. ప్ర‌మాదాల బారీ నుండి త‌ప్పించ‌డానికి ఇలాంటి కొత్త కొత్త ఐడియాల‌ను చేప‌డుతున్నామ‌న్నారు పోలీసులు. కోర్టు వారికి వేసిన శిక్ష మేర‌కు ఇలా విధులు నిర్వ‌ర్తించార‌ని తెలిపారు. రోడ్డుపై ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తున్న వారి ఫోటోల‌ను త‌మ ట్వీట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాచ‌కొండ పోలీసులు.

- Advertisement -