ధోనికి నేను, మానాన్న ఇద్దరం అభిమానులమే-సల్లూభాయ్

207
Dhoni and Salman
- Advertisement -

తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాధించుకున్నారు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకున్నారు. అంతటి ఇమేజ్ స్టార్ మాత్రం ఇండియన్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమానిని అంటున్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్… ధోని అంటే నాకే కాదు మా నాన్నకు ఇష్టం అని చెప్పుకొచ్చారు. ధోని మైదానంలో వ్యవహరించే విధానం ఆయనను ఇష్టపడేలా చేసిందన్నారు. ధోనీ గొప్ప క్రికెటర్ అవుతాడని మా నాన్న ధోనీ కెరీర్ ఆరంభంలోనే నాతో చెప్పేవాడని చెప్పుకొచ్చారు.

Dhoni and Salman

మ్యాచ్ ఓడినా.. గెలిచినా… ధోని ఒకేలా వ్యవహరిస్తారని అన్నారు. మ్యాచ్ ఓడిపోయే సందర్భం ఉన్నా కూడా ధోని కూల్ గా ఉంటాడని, ఆటగాళ్లకు స్వేచ్ఛను ఇస్తాడని అన్నారు. సెంచరీ చేసినా.. మ్యాచ్ గెలిచినా సంబరాలు చేసుకోడు అంటూ ధోనీపై సల్లూ భాయ్ ప్రశంసలు కురిపించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించి సల్లూ భాయ్ సందడి చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా సల్మాన్ కథానాయకుడి రూపొందుతున్న చిత్రం రూస్ 3. ఇప్పటికే రిలీజ్ అయిన  ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెడింగ్ గా నిలిచింది. రంజాను కానుకగా ఈ చిత్రం జూన్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈచిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కథానాయికగా జాక్వెలిన్ నటిస్తోంది. రేస్ 3తో సల్మాన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తాడో లేదో వేచి చూడాలి ఇక.

- Advertisement -