జనవరి 2న వాక్సిన్ డ్రై రన్ జరిగే ప్రాంతాలు ఇవే..

308
- Advertisement -

కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ముందస్తు చర్యలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహించేందుకు ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. జిల్లాలోని జానంపేట పి హెచ్ సి, మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానా, నేహా సన్ షైన్ దవాఖానలు డ్రై రన్ (మాక్ డ్రిల్) నిర్వహనకు ఎంపికైనట్టు ఆయన వెల్లడించారు. వ్యాక్సిన్ డ్రై రన్ అనేది కేవలం కొవిడ్ వాక్సిన్ పంపిణీ నమూనా కార్యక్రమం మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆరోగ్య కార్యకర్తలు ఎక్కువగా ఉన్నచోట ఇలాంటి నమూనా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆయన తెలిపారు.

కొవిడ్ వాక్సినేషన్ డ్రై రన్ పై శుక్రవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 2వ తేదీన ఉదయం 10 గంటలకు పైన పేర్కొన్న మూడు దవాఖానల్లో డ్రై రన్ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రతి కేంద్రం నుంచి 25 మందికి ముందుగానే సమాచారం అందించాలని, వారి వివరాలని అప్లోడ్ చేయాలని చెప్పారు.

మూడు కేంద్రాలలో 2 వ తేదీన వివరాల నమోదు గది, వ్యాక్సిన్ రూమ్, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రోగిని పరిశీలించేందుకు వేచి ఉండేందుకు గది ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల విధుల్లాగే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అన్ని కేంద్రాలలో టెంట్లతో పాటు, అవసరమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, కంప్యూటర్ ఆపరేటర్లను ,శానిటైజర్, మాస్కు, ఉష్ణోగ్రతలు పరిశీలించేందుకు అవసరమైన ఉష్ణోగ్రతను కొలిచే యంత్రాలను ఉంచాలని ఆయన సూచించారు.

జనవరి 2న వాక్సిన్ డ్రై రన్ జరిగే ప్రాంతాలు ఇవే..

హైద్రాబాద్ నగరంలో యూపిహెచ్‌సి తిలకనగర్,నాంపల్లి ఏరియా హస్పటల్,యశోద హాస్పటల్ సోమాజీగూడాలో వాక్సిన్ డ్రై రన్ జరగనుంది.అలాగే మహబూబనగర్ జిల్లాలో పిహెచ్‌సి జనామ్ పేట్,జీజీహెచ్ మహబూబనగర్,నేహా షైన్ హాస్పటల్‌లో జగరునుంది.

- Advertisement -