- Advertisement -
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వణుకుపుట్టిస్తుంది. ఈ వైరస్ వల్ల చైనాలో 3వేల మంది మరణించగా 80వేల మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. చైనాతో పాటు దాదాపు 70దేశాలకు ఈ వైరస్ పాకింది. ఈ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌లపైనే కాదు.. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, మల్టీప్లెక్స్‌లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
ఇప్పటికే కరోనా ఎఫెక్ట్‌తో చాలా మాల్స్‌తో పాటు థియేటర్స్ ఇపుడు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తాజాగా కేరళలో ఆరు కరోనా పాజిటివల్ కేసులు నమోదుకావడంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. థియేటర్స్, మాల్స్, ఎగ్జిబిషన్‌కు సంబంధించిన వాటిని ఈ నెల 31 వరకు నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు నిర్ణయిందింది ప్రభుత్వం. కరోనా భయంతో థియేటర్లు, షాపింగ్ మాళ్లకు ఎవరు వెళ్లడం లేదు. ఇప్పటికే కేరళలో కేసుల సంఖ్య 12 కి పెరిగింది. దీంతో దేశంలో మొత్తం 56 కరోనా కేసులు నమోదయ్యాయి.
- Advertisement -