కరోనా: వేసవిలో పోయినా..శీతాకాలంలో వస్తుంది!

293
corona
- Advertisement -

కరోనా…ఈ పేరు వింటేనే ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పటివరకు 150కి పైగా దేశాలకు విస్తరించింది.వేల సంఖ్యలో మృత్యువాత పడగా లక్షల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు.

కరోనా వ్యాక్సిన్ ఇంకా పరిశోధన దశలో ఉండగా ఎండాకాలం వస్తుంది కాబట్టి కరోనా ఇక పోతుంది అంతా భావించారు. కానీ అలాంటి వారికి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. నిప్పుల కొలిమిని తలపించే వేసవిలోనూ కరోనా బతికే ఉంటుందట..అంతేగాదు శీతాకాలంలో మళ్లీ వైరస్ విజృంభిస్తుందని తెలిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు.

సార్స్‌,మెర్స్‌ తర్వాత అంత ఎక్కువగా ప్రభావం చూపించే వైరస్ కరోనా అని వెల్లడించారు. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేదని..దగ్గు,తుమ్ము తుంపర్ల ద్వారా ఇది వ్యాప్తి చెందుతూనే ఉంటుందన్నారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడమే మేలని..జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట ఉండకపోవడం బెటర్ అన్నారు.

- Advertisement -