ఇది కష్టకాలం..కరోనా వైరస్ పై మహేశ్ ట్వీట్

365
mahesh Babu
- Advertisement -

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు చేపట్టాయి. ఇక కరోనా వైరస్ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలువురు సెలబ్రెటీలు విజ్నప్తి చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్టర్ ద్వారా స్పందించారు. కరోనాపై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని నివారించవచ్చాన్నారు.

ఇది కష్ట కాలమని..అయినా మనం దాన్ని ఆచరించి చూపిద్దామన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక జీవితాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇదే అన్నారు. బయట ఎక్కువగా తిరగకుండా ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. కాగా కరోనా వైరస్ ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ సందేశాన్ని వీడియో ద్వారా తెలియజేశారు. ప్రముఖ హీరో ప్రభాస్ కూడా ట్వీట్టర్ ద్వారా స్పందించారు.

- Advertisement -