దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,26,334కే చేరాయి. గత 24 గంటల్లో దాదాపుగా 10 వేల కేసులు నమోదుకాగా ఇప్పటివరకు దేశంలో 6331 మంది మృతిచెందారు.1,08,580 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.
మహారాష్ట్రలోనే అత్యధికంగా ఇప్పటివరకు 77,793 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా1359 కేసులు నమోదుకాగా..మొత్తం కేసులు 25వేలకు పైగా నమోదయ్యాయి.
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్.. ఉత్తర, దక్షిణ భారతంలో వేర్వేరు తీవ్రతలతో ఉన్నట్టు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) జరుపుతున్న పరిశోధనల్లో వెల్లడైంది.
తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబులుతున్న వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ర్టాలలో విస్తరిస్తున్న వైరస్‌కు స్పష్టమైన తేడా ఉన్నట్టు సీసీఎంబీ జరుపుతున్న జీనోమ్ సీక్వెన్సీ పరీక్షలలో స్పష్టమైంది. పరిశోధకులు దక్షిణాదిలో మనుగడులో ఉన్న వైరస్‌కు ‘ఏ3ఏ’గా, ఉత్తర భారతంలో విజృంభిస్తున్న వైరస్‌కు ‘ఏ2ఏ’గా పేరుపెట్టారు.