వేదం..అద్భుత ప్రయాణం..!

285
allu arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వేదం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బన్నీ కెరీర్‌లో హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా కెబుల్ రాజుగా ఈ సినిమాలో బన్నీ నటనకు మంచిమార్కులు పడ్డాయి.

ఇక ఈ సినిమా విడుదలై దశాబ్దం దాటింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా వేదం సినిమాను గుర్తుచేసిన బన్నీ..చిత్రయూనిట్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి కి మరియు ఆర్కా మీడియాకు ధన్యవాదాలు తెలిపారు బన్నీ.

- Advertisement -