కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనా కేసులు ఎక్కువగా ప్రాంతాల్లో విస్తృత సేవలు అందిస్తున్న ప్రభుత్వం…తాజాగా గ్రేటర్ పరిధిలో కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికోసం చేపడుతున్న చర్యలను అంతా అభినందిస్తుండగా తాజాగా ఓ కరోనా బాధితుడు మంత్రి ఈటల రాజేందర్ పై ప్రశంసలు గుప్పించారు. తన ప్రాణం కాపాడిన దేవుడు అంటూ కొనియాడారు.
శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో ఎండీ రఫీ అనే యువకుడు స్ధానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లారు. అయితే వారు చేర్చుకోవడానికి నిరాకరించడంతో ఇంటర్నెట్ ద్వారా మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ నెంబర్ తెలుసుకుని ఆయనకు ఫోన్ చేశారు.
వెంటనే స్పందించిన ఈటల….తన పీఏ ద్వారా సదరు యువకుడికి కావాల్సిన ట్రీట్ మెంట్‌ని అందించారు. దీంతో తన ప్రాణం కాపాడిన మంత్రి ఈటలపై ప్రశంసలు గుప్పించిన రఫీ…24 గంటలు పనిచేస్తున్న ఆరోగ్య మంత్రికి ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోని పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.