ప్ర‌పంచవ్యాప్తంగా 7ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా బాధితులు

67
corona in Telangana

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి రోజు రోజుకి విస్తరిస్తుంది. కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ 199 దేశాల‌కు విస్త‌రించింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా సోకిన వారి సంఖ్య 7ల‌క్ష‌ల‌కు చేరుకుంది. ఇందులో 31వేల‌737మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు వైద్య ఆరోగ్య‌శాఖ అధికారులు. ఇండియాలో కూడా ఈ వైర‌స్ వేగంగా విస్త‌రిస్తుంది.

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించినా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన వారి సంఖ్య 1000కి చేరింది. ఇందులో 20మంది మ‌ర‌ణించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇట‌లీ, స్పెయిన్ లో అత్య‌ధికంగా ఉంది. ఇట‌లీలో ఇప్ప‌టికే 10వేల మంది మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత స్పెయిన్‌లో 6,528, చైనా 3,300, ఇరాన్ 2,640, ప్రాన్స్ 2,314, అమెరికా 2,229, యూకే 1,029, నెద‌ర్లాండ్స్ 639, జ‌ర్మ‌నీ 455, బెల్జీయం 431, స్విట్జ‌ర్లాండ్ 282, సౌత్‌కొరియా 152, బ్రెజిల్ 114, ఇండోనేషియా 114, ట‌ర్కీ 108, స్వీడ‌న్ 105, పోర్చుగ‌ల్ 100 మంది మృత్యువాత ప‌డ్డారు.