కాంగ్రెస్ అధ్యక్షడు ఎవరో నేడు తేలనుంది. బరిలో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ ఉండగా ఇద్దరి మధ్య హోరాహోరి పోరు జరిగింది.సీనియర్ల మద్దతు ఖర్గేకు ఉండగా యువకులు శశిథరూర్‌కి మద్దతు చెప్పారు. ఇప్పటికే వీరిద్దరూ అన్ని రాష్ట్రాల్లోని పార్టీ కమిటీలతో భేటీ అయి ప్రచారం నిర్వహించారు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఆరోసారి పోలింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నిక జరగనుంది.
24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు. అయితే ఖర్గేకి గాంధీ కుటుంబం పూర్తిస్థాయిలో మద్దతు ఉందని ఆయన గెలుపు ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
2000లో చివరిసారిగా సోనియా గాంధీ, జితేంద్ర ప్రసాద్ మధ్య ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుల్లో సోనియా 22సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేశారు. చివరిసారి గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేస్రీ.