Dharani:ధరణిపై ఎందుకింత డ్రామా!

25
- Advertisement -

రైతుల ప్రయోజనాల కోసం భూ రిజిస్ట్రేషన్ తదితర అంశాలను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ధరణి వచ్చిన తర్వాత ఎలాంటి మధ్యవర్తి లేకుండా భూ రిజిస్ట్రేషన్ పనులు సులభతరం అయ్యాయి. ఇంకా రైతుబంధు నిధులు జమ కావడంలో కూడా ధరణి ఎంతో కీలకం. ఇలా రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ధరణి రద్దవుతుందేమో అనే భయం రైతుల్లో ఎప్పటినుంచో మెదులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ధరణి రద్దు కావడం ఖాయమని ఇటీవల వ్యాఖ్యానించడంతో రైతుల్లో ఆందోళన రెట్టింపు అయింది.

ఇది చాలదన్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్వో వీఆర్ఏ వ్యవస్థను తిరిగి పునరుద్ధరించబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. దీంతో ఇంతకీ రైతుల విషయంలో కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుందనే చర్చ జరుగుతుంది. రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న ధరణిని రద్దుచేసి పాత పద్ధతిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉండడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ధరణి రద్దు చేస్తే రైతుబంధు, రైతు బీమా, భూ అమ్మకం కొనుగోలు, ఇమ్యుటేషన్.. ఇలా చాలా వాటిపైనే ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరణి స్థానంలో భూమాత పేరుతో కొత్త పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ అది సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ధరణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అందరిని కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read:ఈ క్రిమినల్ కేసుకు కారణం కొరటాలే

- Advertisement -