ఈ క్రిమినల్ కేసుకు కారణం కొరటాలే

17
- Advertisement -

కాలం కలిసి రాకపోతే అవమానాలే మిగులుతాయి. ‘శ్రీమంతుడు’ సినిమా కారణంగా డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసు ఎరుర్కోవాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. స్వాతి పత్రికలో ప్రచురించిన కథను శ్రీమంతుడు సినిమా కథ కోసం వాడుకున్నారని 2017లో రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి రచయిత శరత్ చంద్ర తనకు న్యాయం చేయండి అంటూ కొరటాల శివను నేరుగా వెళ్లి కలిసి రిక్వెస్ట్ చేశారు. ఐతే, కొరటాల శివ మాత్రం రచయిత శరత్ చంద్రను పట్టించుకోలేదు.

పైగా, కొరటాల శివ, శరత్ చంద్ర పై ఓ దశలో సీరియస్ కూడా అయ్యాడు. దీంతో శరత్ చంద్ర న్యాయ పోరాటం చేశారు. ఈ నేపథ్యంలోనే శరత్ చంద్ర, కొరటాల శివ పై గెలిచాడు. ముఖ్యంగా కొరటాల శివ క్రిమినల్ కేసు ఎరుర్కోవాల్సిందేనని కోర్టు చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. నిజంగా ఇది కొరటాల కు దారుణ పరాజయమే. కొరటాల దాదాపుగా మౌన ముద్రలోకి వెళ్లి ఒంటరిగా వుండిపోయిన తరుణం ఇది. ఎన్టీఆర్‌తో దేవర సినిమా బిజీలో ఉన్న కొరటాల శివకు తానేమిటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయంలో తన పై ఇలా కొత్తగా క్రిమినల్ కేసు పడటం కొరటాలను తీవ్రంగా బాధ పెడుతుందట.

ఇప్పటికే, కొరటాల శివ గత సినిమా ఆచార్య పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సీడెడ్, నైజాం, కర్ణాటక, ఓవర్ సీస్‌ల్లో నష్టాలే మిగిల్చింది బయ్యర్లకు. ఆ సమయంలో కొరటాల శివ ఎవరినీ పెద్దగా కలవడానికి కూడా ఇష్టపడలేదు. అయితే అదంతా తాత్కాలికమే. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం మాదిరిగా, సినిమా రంగంలో ఫ్లాప్ వైరాగ్యం. ఎన్టీఆర్ పుణ్యమా అని కొరటాల శివ మళ్లీ దేవర సినిమాతో బయటకు వచ్చాడు. దేవర సినిమా విషయంలో కొరటాల శివను ఎవ్వరూ తప్పు పట్టలేదు. పైగా అద్భుతంగా తీస్తున్నాడు అంటూ పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసు పడటం విధి రాతే. ఐతే, ఈ కేసుకు కారణం మాత్రమే కొరటాలే.

Also Read:ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ?

- Advertisement -