కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి

335
gandhibhavan
- Advertisement -

ఎలక్షన్స్‌ల ఎమ్మెల్యే టికెట్‌ ఇయ్యకుంటే లీడర్లు ఏం జేత్తరు.. మందితోని పార్టీ ఆఫీస్‌ ముందట ధర్నా జేత్తరు.. మా లీడర్‌కు టికెట్‌ ఇయకుంటే మేం గ్యాస్‌ నూనే పోసుకుని  సస్తం అని కార్యకర్తలు బెదిరిత్తరు.. ఇంకోకాయన నేను సెల్‌ఫోన్‌ టవరెక్కి దుంకుత.. నేను దుంకుత అని లొల్లి జేత్తడు. పార్టీ అధ్యక్షున్ని తిట్టిన తిట్టు తిట్టకుంట తిడుతరు. పార్టీ ఆఫీసులల్ల కుర్సీలు ఎత్తేసి ఇరగ్గొడ్తరు.. ఇప్పుడు ఇదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీది.

 telangana congress

పొత్తులో భాగంగా శేరిలింగంపల్లి టికెట్ టీడీపీకి ఇస్తున్నారన్న ప్రచారంపై మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గాంధీభవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శేరిలింగంపల్లి టికెట్ కాంగ్రెస్‌కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భిక్షపతి యాదవ్ మద్దతుదారుల్లో ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అదేవిధంగా టీడీపీకి కేటాయించవద్దని మరో కార్యకర్త చేయికోసుకున్నాడు. టీడీపీ తరపున ఎవరిని నిలబెట్టినా ఓడిస్తామని భిక్షపతి యాదవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది.

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఒక్క దగ్గరనే కాదు.. రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్ధితినే ఎదుర్కొంటోంది కాంగ్రెస్‌ పార్టీ. ఓవైపు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంటే కాంగ్రెస్‌ మాత్రం తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించలేదు.. చూడాలి మరి కాంగ్రెస్‌లో ఇంకెందరు నేతలు టికెట్‌ రాలేదని పార్టీ ఆఫీస్‌ను ముట్టడిస్తారో..

- Advertisement -