కారు జోరు… ప్రచారంలో బిజీబిజీగా మంత్రులు

265
trs elections
- Advertisement -

ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు రాష్ట్ర మంత్రులు.. ఆత్మీయ, ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ క్యాంపెయిన్‌ జోరు పెంచుతున్నారు. నాలుగేళ్లలో ఎంతో చేశామని ,ఇసారి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామంటున్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపడం కోసం కాంగ్రెస్ నేతలు కోర్టు మెట్లు ఎక్కారని, కాంగ్రెస్సోళ్లు, చనిపోయిన వ్యక్తుల పేరుతో దొంగ వేలిముద్రలు వేసి అక్రమ కేసులు వేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. యాదగిరిగుట్టలో జరిగిన టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ముసలి నక్క కాంగ్రెస్, గుంట నక్క చంద్రబాబు ఒక్కటై మహాకూటమి పేరుతో మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రాజెక్టులను ఆపడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థుల సీట్ల కేటాయింపు చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందన్నారు.

ktrcamp

అటు గజ్వేల్‌లో జరిగిన ముస్లిం మైనార్టీల గర్జన సభ పాల్గొన్నారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. అభివృద్ధిలో గజ్వేల్ దూసుకుపోతుంది. కాంగ్రెస్, టీడీపీ పాలనలో గజ్వేల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ గజ్వేల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పేదింటి ముస్లిం ఆడబిడ్డ పెండ్లికి షాదీముబారక్ ద్వారా రూ. లక్షా 116 అందిస్తున్నం. దేశంలో ఎక్కడాలేని విధంగా ముస్లింల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇండ్లు లేని పేద ముస్లింలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని వెల్లడించారు. గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తున్నామన్నారు.

harish rao elections

ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కొనియాడారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో జరిగిన ముస్లిం మైనార్టీల గర్జన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముస్లిం విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు సీఎం కేసీఆర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ఇస్తున్నరని తెలిపారు. ముస్లింల కోసం సీఎం కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముస్లింలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారన్నారు.

indrakaranecనిర్మల్ లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహించారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. మంత్రి అల్లోలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. మళ్లీ గెలిస్తే నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి అల్లోల స్పష్టం చేశారు.

- Advertisement -