టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ నేతలు..

171
trs
- Advertisement -

గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రాజకీయాలకతీతంగా జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరికలు అభినందనీయమని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు(ఎస్) మండలం రామన్న గూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెట్టు రాంరెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్‌లో చేరగా మంత్రి జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.

సూర్యపేటతో పాటు ఉమ్మడి జిల్లాలో గత ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న అభివృద్ధికి ఇతర పార్టీల నుంచి ఆగకుండా వలసలు కొనసాగుతున్నాయన్నారు. ఇప్పటికే విపక్షాలు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడిందని.. ఇంకా ఆయపార్టీలలో కొనసాగుతున్న నాయకులు సైతం వుండబట్టలేక స్వచ్చందంగా తరలి రావడం అభినందనీయమన్నారు. అలాగే పార్టీలో చేరిన నాయకులు తామంతా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తోపాటు ఉమ్మడి జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఎవరూ ఊహించని రీతిలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్‌ఎస్‌లో చేరడం గర్వంగా బావిస్తున్నామన్నారు.

ఈ సందర్బంగా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు(ఎస్) మండలం రామన్న గూడెంకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మెట్టు రాంరెడ్డి, జంగాల గౌరయ్య, జంగాల మరియమ్మ, బొక్క ఉపేందర్ రెడ్డి, గొలుసు వెంకయ్య, ఆలకుంట్ల ఉప్పలయ్య, గొలుసుల ముత్తయ్య, పుల్లూరి సైదులుతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో ZP వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహ రావు, కొనతం సత్యనారాయణ రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -