కాంగ్రెస్‌కు మరో షాక్..ఆప్‌లోకి కీలక నేత!

5
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత వీర్‌సింగ్ ధింగన్ ఆప్‌లో చేరారు. మాజీ సీఎం కేజ్రీవాల్ సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనకు సీమాపురి నుండి టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు కేజ్రీ. కాంగ్రెస్ నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు వీర్‌సింగ్.

పార్టీ, ఈ దేశం ఎవరి వారసత్వం కాదని..వీర్‌సింగ్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారని..ఆయన పార్టీలోకి రావడం మరింత బలం చేకూర్చిందన్నారు. సీమాపురి ప్రాంతంలో ఎన్నో పనులు చేశారని ప్రజలు ఇప్పటికి ఆయన్ని గుర్తించుకుంటారన్నారు.

Also Read:రోడ్డుపై సమగ్ర కుటుంబ సర్వే ఫారాలు!

- Advertisement -