కేరళలో మళ్లీ లాక్‌డౌన్..

142
- Advertisement -

కేరళలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్రం మళ్లీ లాక్ డౌన్ బాటపట్టింది. జులై 31, ఆగస్టు 1 వరుసగా రెండు రోజులపాటు లాక్ డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రోజువారి కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం.

నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ నేతృత్వంలో కేరళకు ఆరుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్నీ పంపింది కేంద్ర ఆరోగ్య శాఖ. కోవిడ్ నియంత్రణలో రాష్ట్ర అధికారులకు కేంద్ర బృందం సహాయం చేస్తుందని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండ‌వియా.

గత 24 గంటల్లో ఒక్కరోజులో 22 వేల పాజిటివ్ కేసులు నమోదుకాగా 131 మంది మృతిచెందారు. ఐసీఎంఆర్ జాతీయ స్థాయిలో నిర్వహించిన సెరో సర్వేలో దేశ వ్యాప్తంగా సరాసరిగా 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉంటే.. కేరళ మాత్రం 42.7 శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో మరో 48 శాతం కేరళ ప్రజలకు వైరస్ ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే కేరళలో లాక్ డౌన్ విధించారు.

- Advertisement -