కేరళలో వీకెండ్ లాక్‌డౌన్‌

123
Pinarayi Vijayan

కేరళలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో పినరయి విజయన్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి ఈనెల 23, 24 (శ‌ని, ఆదివారం) తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని పిన‌రాయి విజ‌య‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఇక కేర‌ళ‌లో తాజాగా అత్య‌ధికంగా 16,848 పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా దేశ‌వ్యాప్తంగా వెలుగుచూసిన కేసుల్లో ఇవి 42 శాతం కావ‌డం గ‌మ‌నార్హం. ఈద్ నేప‌థ్యంలో కేర‌ళ‌లో క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది. రోజుకు మూడు ల‌క్ష‌ల టెస్టుల‌తో భారీగా క‌రోనా టెస్టులు నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌ను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది సీపీఎం సర్కార్.