సమంత ఐతే..సమ్మగా ఉంటది: అలీ

292
- Advertisement -

ఈ మధ్యకాలంలో తరచూ హీరోయిన్ల అందంపై ముఖ్యంగా సెక్స్ అప్పీల్ పై వస్తున్న కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. వయసుతో సంబంధం లేకుండా హీరోలే కాదు కమెడియన్లు కూడా భామల ఒంపుసొంపులపై కామెంట్లు చేయటం హాట్ గా మారుతున్నాయి.

ఇక కమేడియన్‌ అలీ విషయానికొస్తే వేరే చెప్పనక్కర్లేదు. ఆయన నోటినుంచి ఏ మాట వచ్చినా మొహమాటం లేకుండా చెప్పేస్తారు. దాన్నేకొంతమంది పంచ్‌ లు అని అంటున్నారు. అలాంటి మాటల వల్ల చాలా సార్లే అలీ విమర్శలు ఎదుర్కున్నాడు.
Comedian Ali Hot Comments on SAMANTHA
అలా ఆయన వ్యవహారశైలిపై ఎన్నివ్యతిరేకతలొచ్చినా అలీ మాత్రం లైట్‌ తీసుకుంటున్నాడనే అనుకోవాలి. ఎందుకంటే..తాజాగా అలీ ఓ హీరోయిన్‌ పై మళ్ళీ హాట్‌ కామెంట్‌ చేశాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో యాంకర్ అడిగిన ప్రశ్నకు అలీ తన స్టైల్‌లోనే సమాధానం చెప్పాడు.  తనను హీరోగా పెట్టి ఎవరైనా సినిమా తీస్తే హీరోయిన్‌గా ఎవర్ని సెలెక్ట్ చేస్తారంటూ..యాంకర్ ప్రశ్నించింది.
Comedian Ali Hot Comments on SAMANTHA
దీనిపై అలీ సమాధానమిస్తూ… మనకు ఈ రకుల్, కాజల్ వంటి వారు సరిపోరని, సమంత అయితే సరిగ్గా ఉంటుందని టక్కున సమాధానమిచ్చాడు అలీ. అయితే సమంతనే ఎందుకని యాంకర్‌ అడగ్గా… సమంత అయితే సమ్మగా ఉంటుందని కామెడీ చేశారు ఆలీ.

ఆ తర్వాత తాను చేసిన కామెంట్ మరీ ఎబ్బెట్టుగా ఉందని ఫీలయ్యాడో ఏమో తెలియదుగానీ… సమంత బాగా నటిస్తుందని.. శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు. కాగా, హీరోయిన్లపై హాట్‌ కామెంట్స్ చేయడం మాత్రం కమేడియన్ అలీకే చెల్లుతుంది. గతంలోనూ చాలామంది హీరోయిన్లపై జోవియల్‌గా కామెంట్లు చేసి విమర్శల పాలైన విషయం తెల్సిందే.

- Advertisement -