కొత్త బిజినెస్ ప్రారంభించిన ఆలీ

447
ali
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కమెడీయన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలీ సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరి సరసన నటించాడు. కమెడీయన్ గా నే కాకుండా కొన్ని సినిమాల్లో హీరోగా కూడా చేశాడు. ఈమధ్య అలీ హవా తగ్గిందనే చెప్పాలి. కొత్త తరం ఆర్టీస్టులు ఇండస్ట్రీకి రావడంతో సినియర్ల వైపు దర్శకులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. తెలుగులో ఆలీ 1000కి పైగా చిత్రాల్లో నటించాడు.  ప్రస్తుతం అలీ బుల్లితెరపై బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అలీ కొత్త రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

ఇన్ని రోజులు కమెడియన్ గా రాణించిన ఆలీ నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో డిజిటల్ రంగంలోకి అడుగుపెడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వెబ్ సిరీస్ లు, టీవీ షోలు, సీరియళ్లు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఇందుకు సంబంధంచిన పూర్తి వివరాలు తెలియనున్నారు. కాగా కొద్ది రోజుల క్రితం ఆలీ వాళ్ల అమ్మ మరణించిన సంగతి తెలిసిందే.

- Advertisement -