నగరంలో 95 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ..

363
CMD Raghuma Reddy
- Advertisement -

భారీ వర్షాల నేపథ్యంలో టీఎస్ ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి,ఇతర డైరెక్టర్ లు ఓల్డ్ సిటీ,హఫీజ్ బాబా నగర్‌లో పర్యనటించి దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలను,పునరుద్ధరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీడిసిఎల్ సిఎండి రఘుమా రెడ్డి మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి,ట్రాన్స్ఫార్మర్స్ కొట్టుకుపోయాయి. మూసి పరివాహక ప్రాంతాల్లో వరదలతో 500 ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతిన్నాయి. 6 వేల మంది సిబ్బందితో నగరంలో 95 శాతం విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు.

ఇవాళ రాత్రి వరకు దాదాపు నగరం అంత విద్యుత్ సరఫరా చేస్తామని సిఎండి తెలిపారు. నగరంలో విద్యుత్‌కు 2 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశాం. అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న విద్యుత్ మిటర్లను పై పోర్షన్‌లో పెట్టుకోవాలి. పై పోర్షన్‌లో విద్యుత్ మీటర్లు అమర్చేందుకు మాకు తెలిజేయాలని సూచించారు. సెల్లార్లలో ఉన్న విద్యుత్ మిటర్లను,కరెంట్ తీగలను ఎవరు ముట్టుకోవద్దు అని సిఎండి రఘుమా రెడ్డి విజ్ఞప్తి చేశారు. సెల్లార్లలో నీరు ఉన్నట్లయితే మాకు తెలుపండి విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం.హైదరాబాద్ నగరం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అన్ని సబ్ స్టషన్లలో డీజిల్ జెనరేటర్లు,విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి వర్షం నీటిని తొడుతున్నామని రఘుమా రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -