- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫార్మా రంగానికి పూర్తి సహకారాలు అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.హైదరాబాద్ హెచ్ సీసీలో జరుగుతున్న 21వ బయో ఆసియా – 2024 సదస్సులో మాట్లాడిన సీఎం రేవంత్.. ఫార్మా రంగంలో సవాళ్లను అర్థం చేసుకోగలను అని తెలిపారు.
ఎన్నో పరిశోధనలకు నిలయంగా హైదరాబాద్ ఉందన్నారు రేవంత్. జాతీయ, అంతర్జాతీయ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఎంఎస్ఎంఈలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు.
ఇటీవల కొంత మంది ఫార్మా రంగం ప్రతినిధులతో సమావేశమయ్యానని..ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పానన్నారు. ప్రపంచంలో మూడు కొవిడ్ వ్యాక్సిన్ లు రాగా అందులో ఒకటి అందించిన ఘనత హైదరాబాద్‌కే దక్కుతుందన్నారు.
Also Read:బండి సంజయ్‌ది రాజకీయ డ్రామా:పొన్నం
- Advertisement -