Rahul:రాహుల్ గాంధీ పోటీ.. తెలంగాణ నుంచేనా?

10
- Advertisement -

గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు తరచూ తెలంగాణలో పర్యటించడం, సభలు నిర్వహించడం వంటివి చేస్తూ ఇక్కడి ప్రజలకు దగ్గరయ్యేందుకు శతవిధాల ప్రయత్నిస్తూ వచ్చారు. ఫలితంగా అధికారం సంపాధించారు కూడా. అయినప్పటికి తెలంగాణ విషయంలో ఇంకా ఏదో ఆశిస్తున్నట్టుగానే ఉంది కాంగ్రెస్ అగ్రనాయకుల వైఖరి. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా మరోసారి సత్తా చాటెందుకు కాంగ్రెస్ నేతలు సిద్దమౌతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ లేదా సోనియా గాంధీ ఈ ముగ్గుర్లో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి లోక్ సభ బరిలో నిలుస్తారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లేదు..

ఇక మిగిలింది రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తెలంగాణ నుంచి పోటీ చేయడం గ్యారెంటీ అనే వాదన రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేయడం గ్యారెంటీ అనేది కొంతమంది అభిప్రాయం. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలే తెలంగాణలో పోటీ చేయమని రాహుల్ గాంధీతో ప్రస్తావించినట్లు టాక్. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారట. ఈ విషయంపై ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో సి‌ఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ చర్చలు కూడా జరుపుతున్నాట్లు వినికిడి. ఒకవేళ రాహుల్ గాంధీ పూర్తి స్థాయిలో ఒకే చెబితే ఖమ్మం లేదా భువనగిరి సీటు రాహుల్ గాంధీకి కేటాయించే ఆలోచనలో ఉన్నారట రాష్ట్ర హస్తం నేతలు. గత ఎన్నికల్లో ఆయన వయనాడ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే సారి లోక్ సభ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెలంగాణలో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ రిస్క్ చేస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. మరి రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చూడాలి.

Also Read:ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా..జాగ్రత్త!

- Advertisement -