- Advertisement -
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి International Kites&Sweets Festival-2024 కు ఆహ్వానించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు. ఈ నెల 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ ఫెస్టివల్ జరగనుంది.
వివిధ దేశాలు, రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులతో ఇప్పటికే మంత్రి జూపల్లి భేటీ అయిన సంగతి తెలిసిందే. కైట్ ప్లేయర్లు రకరకాల పతంగులు తీసుకుని ఇతర దేశాల నుంచి ఇక్కడకు వచ్చి మనకు పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే అతిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఘనమైన ఆతిధ్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిభింబించేలా ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read:కిడ్నీ వ్యాధులను..తగ్గించుకోండిలా!
- Advertisement -