మీరే విస్తరించారు..మీరే వాయిదా వేశారు!

19
- Advertisement -

మంత్రి వర్గవిస్తరణపై తనదైన శైలీలో కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు అని అడగ్గా.. మీరే విస్తరించారు, మీరే వాయిదా వేశారు అంటూ చమత్కరించారు. కాంగ్రెస్ హైకమాండ్ నుంచే సరైన సమాధానం వస్తుందని చెప్పారు.

పీసీసీ చీఫ్ గా తన పదవీకాలం ముగిసేలోపు నూతన అధ్యక్షుడిని నియమించాలని కోరినట్టు చెప్పారు. మంత్రివర్గాన్ని విస్తరణ జరగాలని, పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని ఏఐసీసీ ప్రెసిడెంట్ తో చెప్పాను…. ఈ రెండు అంశాలు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయన్నారు.

ఈనెల 6న ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చెప్పామని వెల్లడించారు. విభజన సమస్యల పరిష్కారానికి చర్చించుకుని ముందుకెళతామన్నారు. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను కేంద్రం చూసుకుంటుందని, అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోతే రెండు రాష్ట్రాలు కలిసి చట్టపరంగా పరిష్కారం కనుగొంటామన్నారు.

Also Read:చిరు..విశ్వంభర లేటెస్ట్ అప్‌డేట్!

- Advertisement -