AIకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

7
- Advertisement -

రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలుకొని ఇప్పుడు AIకి వచ్చాం.. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల ముందు డిక్లరేషన్‌లో చెప్పినట్టే AIకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్..ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఇతర పరిజ్ఞానానికి చెందిన వారికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నాం అని వెల్లడించారు.

మానవ జీవన విధానం కొత్త దిశగా మార్చనుంది AI అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ చాలా వేగంగా ముందుకు వెళ్తోందని, ఇప్పటికే AI ప్రభావం ఏంటో మనం అంతా చూస్తున్నాం అన్నారు. తెలంగాణలో AI రీసెర్చ్ కోసం పెద్ద పెద్ద యూనివర్సిటీలు, విద్యాసంస్థల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నాం అన్నారు

డీప్ ఫేక్ లాంటివి AI మాయాజాలం. AIను ఎథికల్ బెనిఫిట్ కోసం వినియోగించాలన్నారు. హైదరాబాద్ కి దగ్గరలో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మించబోతున్నాం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు అన్నారు. ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ పరుగులు పెడుతోందని..AI గ్రోత్ లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. AIసిటీని ఫ్యూచర్ లో మరింత గా విస్తరిస్తాం అని చెప్పారు.

Also Read:పర్యావరణ పరిరక్షణ కోసం ‘విత్తన గణపతి’: సంతోష్ కుమార్

- Advertisement -