గాంధీలో కరోనా బాధితులను పరామర్శించిన సీఎం కేసీఆర్..

59
gandhi

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు సీఎం. ఆయన వెంట మంత్రి హ‌రీష్ రావు, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు.

కరోనా బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సౌక‌ర్యాల‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనా పేషంట్లకు సేవలందిస్తున్న జూనియర్ డాక్టర్ లను, వైద్య సిబ్బందిని అభినందించారు సీఎం.ఐసీయూలో లో చికిత్స పొందుతున్న పేషంట్ల ను పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించారు.

ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ గాంధీకి రావడంతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.