తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. వందల కిలోమిటర్ల మేర నీళ్లతో నిండు కుండలా మారింది. ఈసందర్భంగా నేడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శిస్తున్నారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో గోదావరి నది వరద ప్రవాహాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు కేసీఆర్.
గోదావరి వరద ఉధృతిపై, తాజా పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, వంతెనపై నుంచి విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని కేసీఆర్ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్ ను సందర్శించారు.
గోలివాడ పంపుహౌజ్ పరిశీలన అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టుని సందర్శించనున్నారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ పూజలు చేయనున్నారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల,ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నారు.