‘సాహో’ నుంచి స‌ర్‌ప్రైజ్ పోస్ట‌ర్ విడుద‌ల‌

643
Sahoo Arjun New Look
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో సాహో మూవీ తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈసినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 30న విడుద‌ల ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇటివలే విడుదలైన ఈచిత్రం టీజర్, ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. తాజాగా చిత్రం నుండి అరుణ్ విజ‌య్ లుక్ విడుద‌ల చేశారు.

హెలికాఫ్ట‌ర్ నుండి దిగి సీరియ‌స్‌గా న‌డుచుకుంటూ వ‌స్తున్న అరుణ్ లుక్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. స్పై థ్రిల్లర్ గా మూవీ తెరకెక్కింది. ఈ చిత్రంలో నితిన్ ముకేశ్, అరుణ్ విజయ్, ఎవ్‌లిన్ శర్మ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే వంటి టాప్ స్టార్స్‌ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. తెలుగు‌తో పాటు హిందీ, తమిళం, మలయాళంలో ఈసినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -