టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ..

118
cm kcr

టిఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జిఎస్టి విషయంలో కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని వివిధ అంశాలపై వివరాలు అందిస్తారు.