బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసీఆర్ సమావేశం..

30
- Advertisement -

ఈనెల అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా బి ఫారాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. అలాగే పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం. అక్టోబర్ 15, 16, 17,18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన ఉండనుంది. నవంబర్ 9 న రెండు చోట్ల సిఎం కేసీఆర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ వివరిస్తారు. సూచనలు ఇస్తారు.అక్టోబర్ 15న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

సిఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలు :

తెల్లారి…అక్టోబర్ 16 నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలో సిఎం పాల్గొంటారు.

17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో సిఎం కేసీఆర్ పాల్గొంటారు.

అక్టోబర్ 18 నాడు.. మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో సిఎం పాల్గొంటారు.

Also Read:గోడకుర్చీ వేస్తే.. ఉపయోగాలు తెలుసా?

సిఎం కేసీఆర్ నామినేషన్లు :

నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి … రెండు నియోజకవర్గాల నుంచి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు. అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

- Advertisement -