హాలియా సభను విజయవంతం చేయాలి- మండలి ఛైర్మన్ గుత్తా

142
Gutha Sukender Reddy
- Advertisement -

ఈ నెల 10 తేదీన నల్లగొండ జిల్లా హాలియాలో టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ స్థలినీ ఈరోజు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్,కార్పొరేషన్ చైర్మన్‌లు బాలమల్లు,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి , టిఆర్‌ఎస్ పార్టీ నేత నోముల భగత్ ఉన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ,తదితర అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు జరిగే పని తీరును అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. సభ ప్రాంగణం ఏర్పాట్లు పరిశించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి జిల్లా అభివృద్ధి చేస్తున్నారు అని గుత్తా తెలిపారు. నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది నల్గొండ జిల్లాకు వరప్రదాయిని.. నెల్లికల్లు ప్రాజెస్ట్ పూర్తి చేయాలని దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరివరకు ప్రయత్నం చేశారు. నర్సింహయ్యకి నివాళులు అర్పిస్తూ సాగర్ నియోజక వర్గానికి చెందిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గుత్తా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పథంలో కొనసాగుతుంది. అనేక సంక్షేమ పథకాలను అమాలు చేస్తూ తెలంగాణ రాష్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి రుణం తీర్చుకునే అవకాశం నాగార్జున సాగర్ ప్రజలకు దక్కింది. ఈ నెల 10 తేదీన జరిగే ప్రాజెక్టుల శంఖుస్థాపన కార్యక్రమాన్ని, భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నల్గొండ ప్రజలను కోరుతున్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్ ,జడ్పి వైస్ ఛైర్మన్ పెద్దులు, మాజీ అప్క్యాబ్ చైర్మన్ యడవల్లి విజేందర్, టి ఆర్ యస్ నాయకులు గడ్డంపల్లి రవీందర్, తదితరులు కూడా హాజరయ్యారు.

- Advertisement -